Sunday, June 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సెలవులకు బైబై.!

సెలవులకు బైబై.!

- Advertisement -

రేపటి నుంచి పాఠశాలల పునఃప్రారంభం
ముస్తాబైన విద్యాలయాలు
నవతెలంగాణ – మల్హర్ రావు

వేసవి సెలవులు ముగిశాయి. దాదాపు రెండు నెలల విరామం తర్వాత విద్యార్థులు మళ్లీ బడిబాట పట్టేందుకు సిద్ధమమైయ్యారు. సోమవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానుండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల్లో కొత్త విద్యా సంవత్సరంపై ఉత్సాహం నెలకొంది. కొత్త తరగతులు, కొత్త పుస్తకాలు, కొత్త లక్ష్యాలతో విద్యార్థులు సెలవులకు బైబై చెప్పి, పాఠశాలలకు స్వాగతం పలకనున్నారు. మరోవైపు సెలవుల్లో ఎంజాయ్ చేసిన తమ పిల్లలను క్రమంగా చదువుల వైపు మళ్లించేందుకు తల్లిదండ్రులు మానసికంగా సన్నద్ధం చేస్తున్నారు. తమ మదిలో దాచుకున్న సెలవుల జ్ఞాపకాలను స్నేహితులతో పంచుకోవడానికి, కొత్త స్నేహితులు ఎవరవుతారోనని విద్యార్థులూ ఆతృతగా ఉన్నారు.

జాలీగా హాలీడేస్..
విద్యార్థి జీవితంలో అత్యంత ఇష్టమైనవి వేసవి సెలవులు. ఈ సెలవులు ఆటలు, అమ్మమ్మ, నాన్నమ్మల ఇళ్లకు ప్రయాణాలు, శుభకార్యాలు, బంధువుల ఇళ్లలోకి సందర్శనలు, విహారయాత్రలు ఇలా జాలీగా గడిచిపోయాయి. చాలామంది చిన్నారులు ఈ వేద సవిని వృథా చేయకుండా డ్రాయింగ్, కరాటే, షటిల్ బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, భరతనాట్యం తదితర ఆటపాటలను నేర్చుకున్నారు.

సిద్ధమవుతున్న స్కూళ్లు..
ఉపాధ్యాయులు కూడా కొత్త విద్యాసంవత్సరానికి ఏర్పాట్లు పూర్తి చేశారు.పాఠశాలల్లో తరగతి గదుల పరిశుభ్రత, బెంచీలు, బ్లాక్ బోర్డులు, తాగు నీటి సౌకర్యం, మధ్యాహ్న భోజన ఏర్పాట్లు, విద్యార్థుల హాజరు నమోదు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇప్పటికే బడిబాట పూర్తిచేసుకున్నారు. విద్యా సంవత్సరం మొదటి రోజు విద్యార్థులకు ఆత్మీయ స్వాగతం పలికేందుకు పాఠశాలలను తీర్చిదిద్దారు. కొత్తగా ఒకటో తరగతిలో చేరే చిన్నారులకు ఇది జీవితంలో తొలి విద్యాప్రయాణం. వారి కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు పాఠశాలలు సిద్ధమైయ్యాయి.

కొత్త బ్యాగులు, పుస్తకాలు..
సెలవుల్లో హాయిగా గడిపిన చిన్నారులు ఇప్పుడు మళ్లీ చదు వుల ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. కొత్త విద్యాసంవత్సరం కొత్త బ్యాగులు, యూనిఫాంలు, షూస్, నోట్బుక్స్, పాఠ్యపుస్తకాల సందడి నెలకొంది. విద్యాసామగ్రి కొను గోళ్లతో మార్కెట్లూ కిటకిటలాడుతున్నాయి. హాస్టళ్లలో ఉండి చదువుకునే పిల్లలకు అవసరమైన సామ గ్రిని సమకూర్చడంలో తల్లిదండ్రులు బిజీగా ఉన్నారు. చాలావరకు ప్రైవేటుసూళ్లు పుస్తకాలు విక్రయిస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -