కారును ముంచేసిన గూగుల్‌ మ్యాప్..

నవతెలంగాణ-హైదరాబాద్ : గూగుల్ మ్యాప్‌ను చూస్తు వెళ్లడంతో కారు కాల్వలోకి వెళ్లింది. దీంతో నలుగురి ప్రాణాల మీదకు తెచ్చింది గూగుల్ మ్యాప్. హైదరాబాద్‌కు చెందిన నలుగురిని ‘కారు’ముంచింది. కేరళలోని అలప్పుళకు వారు టూర్‌ వెళ్లారు. ఆ సమయానికి భారీ వర్షాల కారణంగా వాగులు పొంగిపొర్లుతున్నాయి. రోడ్డుపై వరద కనిపిస్తున్నా గూగుల్‌పై నమ్మకంతో వారు ముందుకే వెళ్లారు. ఈ క్రమంలో వరద నీటి నుంచి కాల్వలోకి వెళ్లిపోయారు. అదృష్టవశాత్తూ అందరూ బయటపడ్డారు కానీ కారు నీట మునిగింది.

Spread the love