– మంత్రి తలసానిశ్రీనివాస్ యాదవ్
నవతెలంగాణ-బేగంపేట్
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎంతో కషి చేస్తుందని, అందుకు ఎన్ని నిదులైనా ఖర్చు చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివద్ధి, సినిమా టోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సోమవారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సీలాల్ పేట డివిజన్ లో రూ.1.96 కోట్ల రూపాయల విలువైన 9 అభివద్ధి పనులను మంత్రి శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ముందుగా భోలఖ్‌పూర్‌లోని కష్ణానగర్‌లో రూ.18.85 లక్షల వ్యయంతో చేపట్టనున్న కమ్యునిటీ హాల్ నిర్మాణ పనులను, సుందరయ్య వీకర్ సెక్షన్‌లో రూ.18.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీవరేజ్ లైన్ పునరుద్దరణ పనులు, భోలఖ్‌పూర్‌లో రూ.6 లక్షల రూపాయల వ్యయంతో వాటర్ లైన్ పనులు, న్యూ బోయగూడలో రూ.26.80 లక్షల వ్యయంతో వీడీసీసీ రోడ్డు నిర్మాణ పనులు, డాన్ బోస్కో కాలేజ్ వద్ద 20.80 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణం తదితర పనులను ప్రారంభించారు. ఆయా ప్రాంతాలలో పాదయాత్రగా తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలు సుకున్నారు. అదేవిధంగా గొల్ల కొమరయ్య కాలనీలో ఇటీవలనే నిర్మించిన రోడ్డుపై నీరు ప్రవహిస్తుందని, సమస్య పరిష్కరించాలని స్థాని కులు మంత్రిని కోరగా స్పందించిన మంత్రి సమస్య పరిష్కారానికి చర్యలు తీసు కోవాలని సంబంధింత అధికారులను ఆదేశించారు. అభివద్ధిలో సనత్‌నగర్ నియోజక వర్గాన్ని ముం దుంచే విధంగా కషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట కార్పొరేటర్ హేమలత, జోనల్ కమిషనర్ రవి కిరణ్, డీసీ శంకర్, ఈఈ సుదర్శన్, వాటర్ వర్క్స్ సీజీఏం ప్రభు, ఎలెక్ట్రికల్ డీఈ శ్రీధర్, పద్మారావు నగర్ బీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌చార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్, డివిజన్ అద్యక్షుడు వెంకటేష్ రాజు, నాయకులు లక్ష్మీపతి, శ్రీకాంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఓటు నమోదు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి
బన్సీలాల్ పేట లోని భోలఖ్‌పూర్‌లో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన ఓటు నమోదు కేంద్రాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలని అన్నారు. పార్టీ శ్రేణులు ఇంటింటికి వెళ్ళి అర్హత కలిగి ఓటరుగా నమోదు కాని వారిని గుర్తించి నమోదు చేయించుకొనే విధంగా చూడాలని ఆదేశించారు. ఓటర్లకు అవగాహన కల్పించాలని అన్నారు.
రోడ్ల నిర్మాణ పనులు పూర్తి చేయాలి
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
ఈ నెల చివరికి బ్రాహ్మణ వాడిలో సీవరేజ్ పైప్‌లైన్ ఏర్పాటు
ఈ నెల చివరి నాటికి బ్రాహ్మణ వాడిలో సీవరేజ్ పైప్ లైన్ ఏర్పాటు చేస్తామని, అలాగే రోడ్ల నిర్మాణ పనులు పూర్తి చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధి కారులను ఆదేశించారు. సోమవారం ఆయన అధికారులతో కలిసి బ్రాహ్మణ వాడిలో పర్యటించి బేగంపేట నాలా అభివద్ధి పనులు, కాలనీలో జరుగుతున్న అభివద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని అధికారులు మంత్రికి వివరించారు. నాలాలో పూడిక తీసిన మట్టిని తొలగించి అక్కడే ఉంచారని స్థానికులు మంత్రి దష్టికి తీసుకురాగా, వెంటనే మట్టిని తరలించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బేగంపేట నాలా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ను కోరగా సమగ్ర నాలా అభివద్ధి కార్యక్రమం క్రింద రూ.45 కోట్ల రూపాయల వ్యయంతో నాలా అభివద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. కాలనీలలోకి వరదనీరు రాకుండా నివారించేందుకు గాను రిటైనింగ్ వాల్స్ నిర్మాణం, నాలాలో పూడికను తొలగించడం జరు గుతుందని తెలి పారు. బ్రాహ్మణ వాడిలో సీవరేజ్, వాటర్‌లైన్ ఏర్పాటు, సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు. ఎస్‌ఎన్‌డీపీతో ఈ సంవత్సరం ముంపు సమస్య ప్రభావం చాలా వరకు పరిష్కరించబడిందని అన్నారు. పనులు పూర్తయితే ముంపు సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుందన్నారు. మంత్రి వెంట కార్పొరేటర్ టి.మహేశ్వరి, జోనల్ కమిషనర్ రవి కిరణ, డీసీ శంకర్, ఈఈ సుదర్శన్, ఎస్‌ఎన్‌డీపీ ఎస్‌ఈ భాస్కర్ రెడ్డి, వాటర్ వర్క్స్ సీజీఎం ప్రభు, ఎలేక్త్రిసిటీ డీఈ సుధీర్, స్ట్రీట్ లైట్ ఏఈ భరత్, నాయకులు నరేందర్, శ్రీహరి, శ్రీనివాస్ గౌడ్, అఖిల్, ఆరీఫ్ తదితరులు ఉన్నారు.