హైదరాబాద్ మెట్రో రైలుపై ప్రభుత్వ కీలక నిర్ణయం నిర్వహణకు కమిటీ
హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 1నుంచి ప్రభుత్వ నిర్వహణలోకి హైదరాబాద్ మెట్రోరైలు రానుంది. ఈ మేరకు హైదరాబాద్ మెట్రో రైలు నిర్వహణకు ప్రభుత్వం కమిటీ వేసింది. సీఎస్ రామకృష్ణారావు చైర్మెన్‌గా మెట్రోరైలు కమిటీ ఏర్పాటు చేయగా హెచ్‌ఎంఆర్‌ఎల్ నిర్వహణకు 10 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. హెఎంఆర్‌ఎల్ ఎండీగా ఐఏఎస్ అధికారి సర్ఫరాజ్ అహ్మద్ బాధ్యతలు తీసుకోనున్నారు. హెచ్‌ఎంఆర్‌ఎల్ డైరెక్టర్లుగా జయేశ్‌రంజన్, వికాస్‌రాజ్, సందీప్ కుమార్ సుల్తానియా, శివధర్‌రెడ్డి, అశోక్‌రెడ్డి, జితేశ్ వి.పాటిల్ ఉండగా హెచ్‌ఎంఆర్‌ఎల్ జాయింట్ ఎండీగా శివేంద్రప్రతాప్ నియామకమయ్యారు.
మెట్రో ఈక్విటీ కొనుగోలుకు రూ.13,615 కోట్లు అవసరం
ఈ నెలాఖరులోగా(ఏప్రిల్) హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు స్వాధీనానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చకచకా అడుగులు వేస్తోంది. ఈ మేరకు మొదటి దశ స్వాధీనానికి అవసరమైన ప్రక్రియకు సంబంధించి జీవో 127ను మెట్రోపాలిటన్ ప్రాంతం, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ జయేశ్‌రంజన్ శుక్రవారం జారీచేశారు. ఎల్‌అండ్‌టీకి ఉన్న 100 శాతం ఈక్విటీ వాటా కొనుగోలు చేయడం, ఐఆర్‌ఎఫ్‌సీ నుంచి లోన్, ఒప్పందాల అమలు, ఇతర అంశాలతోపాటు క్యాబినెట్ సబ్‌కమిటీ చేసిన సిఫారసులతో హైదరాబాద్ మెట్రోరైలు లిమిటెడ్(హెచ్‌ఎంఆర్‌ఎల్) ఎండీ పలు ప్రతిపాదనలు చేశారు. వీటిపై గురువారం క్యాబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాల మేరకు తాజాగా ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
టేకోవర్‌కు సంబంధించి షేర్ పర్చేజ్ అగ్రిమెంట్, ఐఆర్‌ఎఫ్‌సీ నుంచి లోన్, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అండర్‌టేకింగ్ లేఖ, ప్రభుత్వ గ్యారంటీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) నుంచి డైరెక్ట్ డెబిట్ మాండేట్, రుణ టర్మ్‌షీట్, త్రైపాక్షిక ఒప్పందం, హెచ్‌ఎండీఏ నుంచి ఈక్విటీ నిధుల సమీకరణతోపాటు పలు అంశాలను ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
మే 1 నుంచి సర్కార్ మెట్రో
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



