Sunday, April 26, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంనేటి నుంచేడిజిటల్‌ జనగణన

నేటి నుంచేడిజిటల్‌ జనగణన

- Advertisement -

మీ వివరాలను మీరే నమోదు చేసుకోవచ్చు
ఒక మొబైల్‌ నంబర్‌తో
ఒకే కుటుంబ వివరాల నమోదు
ఇంటి యజమాని పేరును ఒకసారి ఎంటర్‌ చేస్తే మార్చుకోలేం : సెన్సస్‌ డైరెక్టర్‌ భారతి హోళికేరి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వి.కర్ణన్‌
నవతెలంగాణ-సిటీబ్యూరో

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 2027 జనగణన నిర్వహణకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. 2027 జనగణనపై శనివారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సెన్సస్‌ డైరెక్టర్‌ భారతి హోళికేరి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వి.కర్ణన్‌ సెన్సస్‌ ప్రక్రియకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. సుమారు 16 ఏండ్ల సుదీర్ఘ విరామంతోపాటు రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి జనగణన కావడం విశేషం. నేటి (ఏప్రిల్‌ 26) నుంచి మే 10వ తేదీ వరకు సెల్ఫ్‌ ఎన్యూమరేషన్‌ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సెన్సస్‌ డైరెక్టర్‌ మాట్లాడూతూ.. మే 10 వరకు సెల్ఫ్‌ ఎన్యూమరేషన్‌ (స్వీయ నమోదు) చేసుకోవచ్చని చెప్పారు. ఈసారి జనగణన పూర్తిగా డిజిటల్‌ రూపంలో జరుగుతుందని, గతంలో మాదిరిగా కాగితాలపై రాసి ఆ తర్వాత సిస్టమ్‌లో ఎంటర్‌ చేసే విధానానికి స్వస్తి పలికినట్టు భారతి హోళికేరి తెలిపారు. ప్రజలు నేరుగా ‘రవ.షవఅరబర.స్త్రశీఙ.ఱఅ- పోర్టల్‌లో వివరాలను నమోదు చేసుకోవచ్చన్నారు. ఈ వెబ్‌సైట్‌ ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటుందన్నారు. ఒక మొబైల్‌ నెంబర్‌తో ఒకే కుటుంబ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఇంటి యజమాని పేరును ఒకసారి ఎంటర్‌ చేస్తే మార్చుకోవడానికి వీలుండదని, జాగ్రత్తగా నమోదు చేయాలని సూచించారు.

జనగణనలో మొత్తం 33 ప్రశ్నలుంటాయని, ఇది రెండు దశల్లో జరుగుతుందని తెలిపారు. హౌస్‌ లిస్టింగ్‌లో మొదటగా ఇండ్లు, అపార్ట్‌మెంట్లు, గుడిసెలు, కాలేజీలు ఇలా ప్రతి ఆస్తినీ గుర్తిస్తారని, ప్రతి ఇంటికీ ఒక నెంబర్‌ కేటాయిస్తారని అన్నారు. కుటుంబ సభ్యుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తారని, ఆ వివరాలను రహస్యంగా ఉంచుతామని అన్నారు. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న వారికి వచ్చే ‘ఐడీ’ని ఎన్యూమరేటర్‌కు చూపించాలన్నారు. దాని ఆధారంగా ఏవైనా మార్పులు (చేర్పులు/తొలగింపులు) ఉంటే సరిచేస్తారన్నారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వి.కర్ణన్‌ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ నగర వ్యాప్తంగా 21,866 ఎన్యూమరేటర్‌ బ్లాక్‌లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రిన్సిపల్‌ సెన్సస్‌ ఆఫీసర్‌గా జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ వ్యవహరిస్తుండగా.. అదనపు సెన్సస్‌ అధికారులుగా సీఏంసీ, ఏంఏంసీ కమిషనర్లు బాధ్యతలు తీసుకుంటారని చెప్పారు. 300 వార్డులను j¶నిట్లుగా తీసుకుని లెక్కలు సేకరిస్తారన్నారు. హైదరాబాద్‌ నగరంలో విద్యావంతుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి సెల్ఫ్‌ ఎన్యూమరేషన్‌ చేసుకోవాలని కమిషనర్‌ కోరారు. ప్రభుత్వ భవిష్యత్‌ ప్రణాళికలు, సంక్షేమ పథకాల రూపకల్పనలో ఈ జనగణన గణాంకాలు అత్యంత కీలకం కానున్నాయని చెప్పారు. అందువల్ల ప్రతి పౌరుడూ బాధ్యతగా ఇందులో పాల్గొని సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. అనంతరం సెన్సస్‌ క్యాలెండర్‌ను, కప్‌ను విడుదల చేసి.. పంపిణీ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -