Tuesday, June 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య కుటుంబ సమేతంగా మంగళవారం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు చేశారు. సందర్భంగా శ్రీ బీర్ల అయిలయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించినట్లు తెలిపారు. ఆలేరు నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో, ఆనందంగా ఉండాలని ప్రత్యేకంగా మొక్కులు చెల్లించుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే ప్రజా సేవలో మరింత నిబద్ధతతో పనిచేసేలా స్వామివారి ఆశీస్సులు కోరుకున్నట్లు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -