బీఆర్ఎస్ టార్గెట్ గా గవర్నర్ ప్రసంగం

నవతెలంగాణ హైదరాబాద్: మన రాజ్యాంగం ఎంతో మహోన్నతమైందని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తెలిపారు. మన రాజ్యాంగ నిర్మాతలు ఎంతో ముందుచూపుతో వ్యవహరించి దానిని తయారు చేశారన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నాంపల్లి పబ్లిక్‌ గార్డెన్స్‌లో జాతీయ పతాకాన్ని గవర్నర్‌ తమిళిసై ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ… ”రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా పాలకులు వ్యవహరిస్తే ప్రజలు ఊరుకోరు. పోరాటాలు, తీర్పుల ద్వారా అధికారాన్ని నియంత్రించే శక్తి వారికి ఉంది. రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ద్వారానే తెలంగాణ సాధించుకున్నాం. గడిచిన పదేండ్లలో రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా పాలకులు వ్యవహరించారు. నియంతృత్వ ధోరణితో వెళ్లడాన్ని తెలంగాణ సమాజం సహించదు. ఎన్నికల్లో తీర్పు ద్వారా నియంతృత్వ ధోరణికి చరమగీతం పాడారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అహంకారం, నియంతృత్వం చెల్లదని విస్పష్టమైన తీర్పు ఇచ్చారు. విధ్వంసానికి గురైన వ్యవస్థలను పునర్నిర్మించుకుంటున్నాం’’ అని గవర్నర్‌ తెలిపారు.

Spread the love