నవతెలంగాణ- హైదరాబాద్ : తెలంగాణ మూడో అసెంబ్లీ శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. సమావేశం ప్రారంభం అనంతరం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం జరగనుంది. నూతన సభ్యులతో ప్రొటెం స్పీకర్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఈ సభలో ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ వ్యవహరించనున్నారు. శనివారం ఉదయం 8:30 గంటలకు రాజ్‌భవన్‌లో అక్బరుద్దీన్ ఒవైసీ చేత ప్రొటెం స్పీకర్‌గా గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ప్రమాణం చేయించనున్నారు. ఈ మేరకు ప్రొటెం స్పీకర్ నియామకంపై రాజ్‌భవన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.