కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం మొద్దు నిద్ర..

నవతెలంగాణ- దుబ్బాక రూరల్
జిపి కార్మికులు పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న మొద్దు నిద్ర వీడాలని సీఐటీయూ మండల నాయకులు ఎండి సాదిక్ అన్నారు. దుబ్బాక మండలంలో గ్రామపంచాయతీ కార్మికులు చేపట్టిన రాష్ట్రవ్యాప్త సమ్మె 9వ రోజుకు చేరుకున్న సందర్భంగా  సీఐటీయూ మండల నాయకులు మద్దతు తెలిపి మాట్లాడారు. ఏళ్ల తరబడి గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించక పోవడం బాధాకరమన్నారు. పొద్దున లేచి నుండి గ్రామాల్లో సాయంత్రం వరకు పనులు చేస్తూ అనారోగ్యం బారినపడి చనిపోతున్న వారిని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించకపోవడం విడ్డూరం అన్నారు. జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలను పెంచి , మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జిపి కార్మికులకు ఈఎస్ఐ, పిఎఫ్, ఉద్యోగ భద్రత, భీమ సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జీపీ కార్మికుల సమస్యల పరిష్కారంలో  చలనం లేదని విమర్శించారు.కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్మికులు ప్రశాంత్, శ్రీను, రవి, శ్రీకాంత్, దుర్గవ్వ, ఎల్లవ్వ, బాబాయి, లచ్చవ్వ తదితరులు పాల్గొన్నారు.
Spread the love