నత్తనడకన సాగుతున్న ధాన్యం కొనుగోళ్లు

Grain procurement going on at a snail's pace– జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు ఫకీర్ రాజేందర్ రెడ్డి

నవతెలంగాణ – బొమ్మలరామరం   
ధాన్యం కొనుగోళ్లు విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న అస్పష్ట వైఖరి కారణంగా అటు మిల్లర్లు, ఇటు రైతులు ఇబ్బందులు పడుతున్నారని,జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు ఫకీర్ రాజేందర్ రెడ్డి అన్నారు. బొమ్మలరామారం మండలంలోని జిల్లా కిషన్ మోర్చా పార్టీ పిలుపుమేరకు మంగళవారం తహసిల్దార్ కార్యాలయం ఎదురుగా నిరసన వ్యక్తం చేశారు.అనంతరం తాసిల్దార్ శ్రీనివాసరావుకు వినతిపత్ర అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..నత్తనడకన ధాన్యం కొనుగోలు సాగుతున్నాయని, దళారులకు, రైస్ మిల్లర్లకు కొమ్ముకాస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అని మండిపడ్డారు. దుడ్డు రకానికి సన్న రకానికి అన్ని పంటలకు వెంటనే బోనస్ అందజేయాలని, కౌలు రైతులకు కూడా ఇందిరమ్మ రైతు భరోసా కల్పించాలని అన్నారు.లేనిపక్షంలో రైతుల మద్దతుతో మరో ఉద్యమానికి పిలుపునిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు చిమ్ముల రవీందర్ రెడ్డి, నాయకులు ఎల్ల గౌడ్, రవీందర్ రెడ్డి గోపాల్ గౌడ్, ఈశ్వర్ గౌడ్, యువమోర్చా గుర్రం ప్రవీణ్ రెడ్డి, చీర గణేష్, గుర్రం ప్రవీణ్ రెడ్డి, గోపాల్, బాలరాజ్, సతీష్ యాదవ్ పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love