గ్రామపంచాయతీ సిబ్బంది సమ్మె నోటీస్

నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని గ్రామ పంచాయితీల సిబ్బంది సోమవారం మండల కేంద్రంలో ఎంపీడీవో కు సమ్మె నోటీస్ ఇచ్చారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్మికులు మాట్లాడుతూ ఎన్నో ఎన్నో సంవత్సరాల నుండి చాలీచాలని వేతనాలతో గ్రామపంచాయతీలో పనిచేస్తున్నాము కానీ ప్రభుత్వము గ్రామపంచాయతీలో పనిచేసే సిబ్బందిని పట్టించుకోవడం లేదు ప్రభుత్వం పెట్టే పనులు పల్లె ప్రగతి హరితహారం వారోత్సవాలు మరికొన్ని పనులు చేపడుతున్నాము కానీ ప్రభుత్వము ఎలాంటి స్పందన లేకుండా ఉండడం వలన మేము మా కుటుంబము గడవడం లేదని ఎన్నోసార్లు మంత్రులకు అధికారులకు మోకరిల్లి దరఖాస్తులు ఎన్నో పెట్టడం జరిగింది కానీ గ్రామపంచాయతీలో పనిచేసే సిబ్బందిని పట్టించుకోవడం లేదని జూలై ఆరో తారీకు రోజున రాష్ట్రవ్యాప్తంగా నివేదిక సమ్మెకు దిగడము జరిగిందన్నారు. ఆ కారణంగా ఈరోజు గోవిందరావుపేట మండలంలోని ఎంపీడీవో కార్యాలయం ముందు ఎంపీడీవో కి సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు తండా కుమార్ మండల ప్రధాన కార్యదర్శి దుస్స సతీష్ మండల గౌరవ అధ్యక్షులు దొంగరి ఉప్పలయ్య మండల ఉపాధ్యక్షులు అన్నమల్ల వెంకన్న సీతయ్య సాంబయ్య అశోకు శివ జన్ను సమ్మక్క సప్పిడి నర్సమ్మ ఇల్లందులో రజిని దర్శనాలు ఎల్లమ్మ ఇతరాలు పాల్గొన్నారు.

Spread the love