ఘనంగా బక్రీదు వేడుకలు..

నవతెలంగాణ – ధర్మసాగర్
పవిత్ర బక్రీద్ (ఈదుల్ అజ్ హా) పర్వదినం సందర్భంగా స్థానిక జామియా మస్జిద్ కమిటీ ధర్మసాగర్ వారి ఆధ్వర్యంలో గురువారం ఈద్గాహ్ వద్ద ప్రత్యేక నమాజ్ కార్యక్రమం ఆచరించడం జరిగింది. అనంతరం పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. తదఅనంతరం తమకన్నా ముందు గతించిన పూర్వీకులను,బంధు-మిత్రుల పక్షాన దుఆ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love