ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు

నవతెలంగాణ-బెజ్జంకి: తెలంగాణ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలను బుధవారం మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయం వద్ద మండల కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
బియ్యం అందజేత…
మండల కాంగ్రెస్ నాయకుడు చెప్యాల శ్రీనివాస్ గౌడ్ మంత్రి పొన్నం జన్మదినం సందర్భంగా చిన్నకోడూర్ మండలం చెర్ల అంకిరెడ్డి పల్లి గ్రామ శివారులోని వృద్ధుల అనాథ ఆశ్రమానికి 25 కిలోల బియ్యమందజేశారు.

Spread the love