
డిచ్ పల్లి,ఇందల్ వాయి మండల కేంద్రలతో పాటు ఆయా గ్రామాలలో చత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. డిచ్ పల్లి మండలం లోని సుద్దపల్లి లో బిజెవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పానుగంటి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో శివాజీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఇందల్ వాయి మండల కేంద్రంలోని తిర్మన్ పల్లి లో యే యువకులు డప్పు డప్పు వాయిద్యాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు ఎంబడి భూషణ్, మహేందర్, సాయిలు, క్రాంతి కుమార్, ప్రవీణ్ రెడ్డి, లక్ష్మారెడ్డి, యువకులు తదితరులు పాల్గొన్నారు.