సీఐటీయూ ఆధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలు

నవతెలంగాణ – జమ్మికుంట
ప్రపంచ కార్మిక పోరాటస్ఫూర్తి దినోత్సవాన్ని, పురస్కరించుకొని, జమ్మికుంట రామలింగేశ్వర మిల్లు వద్ద రైస్ మిల్ ఆపరేటర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ యూనియన్ అధ్యక్షులు బైరం సమ్మయ్య, ఆవిష్కరించారు. భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఎస్బిఐ  యూనియన్ మండల కార్యదర్శి గేరా రాజకుమారి జండా ఆవిష్కరణ చేశారు.ట్రాన్స్పోర్ట్ హమాలి  యూనియన్ ఆధ్వర్యంలో, సిఐటియు మండల కార్యదర్శి  జక్కుల రమేష్ యాదవ్ జెండా  ఆవిష్కరించారు. ఈ   కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న, సిఐటియూ జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్  మాట్లాడారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలుసంఘటిత ,అసంఘటిత రంగ కార్మికులకు, కనీస వేతనాలు అమలు చేయడంలో, ఉద్యోగ భద్రత కల్పించడంలో,  పి ఎఫ్ ,ఇ ఎస్ ఐ, పెన్షన్, సౌకర్యాలు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని ఆరోపించారు. కార్మికుల పక్షపాతం అని చెప్పుకుంటున్న కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు, మే డే ప్రపంచ కార్మిక దినోత్సవం రోజు కూడా  సెలవు దినం ప్రకటించకుండా, పెట్టుబడుదారులకు కార్పొరేట్లకు,వ్యాపారవేత్తలకు కొమ్ముకాస్తూ, ఉద్యోగస్తులతో కార్మికులతో,బెదిరింపులకు పాల్పడుతూ పనులు చేయించుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. ఇలాంటి ప్రభుత్వాలు ఎవరి పక్షాన ఉన్నాయో కార్మికులు ఆలోచించి, రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి కేంద్ర ప్రభుత్వానికి ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని ఆయన కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆపరేటర్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు అడెపు రాజనర్సు, యూనియన్ మండల కార్యదర్శి గడ్డం శోభన్, కన్నం సదానందం, పుల్లూరి రాములు, బండ సురేష్,  ఎర్రం రాజు నవిను, నిమ్మల రమేష్, కుసుమ రవి, తిరుపతి, తదితర కార్మికులు పాల్గొన్నారు.
Spread the love