ఘనంగా పెద్దమ్మ 20వ వార్షికోత్సవం

– బోనాలు, అన్నసత్రం..
నవతెలంగాణ- డిచ్ పల్లి
ఇందల్ వాయి మండలంలోని యెల్లరెడ్డి పల్లి గ్రామ పరిధిలోని దర్పల్లి -ఇందల్ వాయి రహదారి పై ఉన్న పెద్దమ్మ 20వ వార్షికోత్సవాన్ని ముదిరాజ్ సంఘ సభ్యులు శనివారం ఘనంగా నిర్వహించారు.అంతకు ముందు గ్రామం లోని పలు విదుల గుండ బోనాలను ఉరేగింపు చేసి అలాయనికి డప్పు వాయిద్యాలతో చేరుకున్నారు.ఆలయంలో అభిషేకం, అర్చనలు, కళ్యాణం, చేసిన అనంతరం అన్న సత్రం నిర్వహించినట్లు అలయ కమిటీ అధ్యక్షుడు బొడ్డు రవి ముదిరాజ్ తెలిపారు. ఈ వార్షికోత్సవంలో భాగంగా ప్రతి ఏటా అంగరంగ వైభవంగా గ్రామం నుండి ఆలయం వరకు భారీ సంఖ్యలో బోనాలను ఉరేగించారు.ఈ వార్షికోత్సవం, వైకుంఠ ఏకాదశి ఉండటంతో మహిళలు ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు.ఈ వార్షికోత్సవం ను పురస్కరించుకొని గ్రామం తో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి ముదిరాజ్ కులస్తులు, ఇతరులు భారీ సంఖ్యలో ప్రజలు భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆర్ సాయిలు ముదిరాజ్, పి నడ్పి సాయిలు ముదిరాజ్, గంగాధర్ ముదిరాజ్, సాగర్ ముదిరాజ్, మల్లయ్య ముదిరాజ్, సునీల్ ముదిరాజ్, రజనకాంత్ ముదిరాజ్, గంగారం ముదిరాజ్, లక్ష్మన్ ముదిరాజ్, పాటు మహిళలు, గ్రామస్తులు ముదిరాజ్ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love