Sunday, September 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహిళా సంఘం భవనానికి భూమి పూజ

మహిళా సంఘం భవనానికి భూమి పూజ

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్ (రాజంపేట్)
రాజంపేట్ మండలంలోని ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో గురువారం మహిళా సంఘం భవనానికి భూమి పూజ కార్యక్రమాన్ని సర్పంచ్ గోదావరి నరేందర్ గౌడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా సంఘం సభ్యులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ మహిళా సంఘాల భవనానికి నిధులు కేటాయించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మదన్ మోహన్ కు ధన్యవాదాలు తెలిపారు. గ్రామం మధ్యలో భవనానికి భూమి కేటాయించిన సర్పంచ్ కు మహిళా సంఘం సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ చిన్న నరసయ్య, సిసి సాయిలు, మహిళ సంఘం సభ్యులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -