Wednesday, July 8, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంగెస్టు లెక్చరర్లకురూ.50 వేల వేతనమివ్వాలి

గెస్టు లెక్చరర్లకురూ.50 వేల వేతనమివ్వాలి

- Advertisement -

యూనివర్సిటీలు, డిగ్రీ కాలేజీల్లోని పోస్టులను
భర్తీ చేయాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీ
సీఎంకు, ప్రభుత్వ సలహాదారు కేకేకు లేఖ


‌నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు యూనివర్సిటీలు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లు, ఫ్యాకల్టీలకు రూ.50 వేల వేతనమివ్వాలనీ, వాటిలో దీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీ డిమాండ్‌ ‌చేశారు. మంగళవారం ఈ మేరకు సీఎం రేవంత్‌‌రెడ్డికి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావుకు వేర్వేరుగా లేఖలు రాశారు. రాష్ట్రంలో యూనివర్సిటీ అనుబంధ కళాశాలల్లో గెస్ట్ లెక్చరర్లుగా, ఫ్యాకల్టీగా సుమారు 1,240 మంది 20 ఏండ్లుగా అంకితభావంతో పనిచేస్తున్నారని వారి దృష్టికి తీసుకెళ్లారు. వారికి కనీస వేతనం, ఉద్యోగ భద్రత, సాధారణ సెలవులు వర్తించడం లేదనీ, పని గంటలకు తగ్గట్టుగా వేతనం పెరగడం లేదని ఎత్తిచూపారు. నెలకు రు.28వేల వేతనం మాత్రమే చెల్లిస్తున్నారని తెలిపారు. వారికి నెలకు రూ.50వేల వేతనం పెంచుతామని ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. వారు మంత్రులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నా ప్రభుత్వం నుంచి కనీస స్పందన రావట్లేదనీ, తక్ష‍ణమే మీరు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని విజ్ఙప్తి చేశారు. వర్సిటీలు, డిగ్రీ కాలేజీల్లో దాదాపు 1940 పోస్టులు ఖాళీగా ఉన్నాయనీ, దాని వల్ల విద్యాబోధనపై తీవ్ర ప్రభావం పడుతోందని వారి దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్హతలు ఉండి, దశాబ్దాలుగా అధ్యాపకులుగా పనిచేస్తున్న గెస్టు లెక్చరర్లు, ఫ్యాకల్టీ సేవలను శాశ్వత ప్రాతిపదికన వినియోగించుకునేలా పర్మినెంట్‌ ‌చేయాలనీ, మిగతా పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ ‌చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -