కాంగ్రెస్ పార్టీ ఎస్టీసెల్  మండల అధ్యక్షునిగా గుగులోతు శ్రీనునాయక్

– ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేత
– ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు రవినాయక్
నవతెలంగాణ – నెల్లికుదురు
మండలంలోని నల్లగుట్ట తండా గ్రామపంచాయతీకి చెందిన గుగులోతు శ్రీనివాసునీ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ మండల అధ్యక్షునిగా నియమించినట్లు ఆ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు రవి నాయక్ తెలిపారు. శుక్రవారం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జన్నారెడ్డి  భరత్ చందర్ రెడ్డి ఆదేశాల మేరకు మహబూబా నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ చేతుల మీదుగా శుక్రవారం నియామక పత్రాన్ని అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమంలో చురుకైన వ్యక్తిగా కొనసాగినందున అతని గుర్తించి ఎస్టీ సెల్ మండల అధ్యక్ష పదవిని కట్టబెడుతున్నామని అన్నారు. పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు నూతన ఎస్టి సెల్ మండల అధ్యక్షుడు శ్రీను నాయక్ మాట్లాడుతూ పార్టీ ప్రవేశపెట్టిన ప్రతి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. కార్యకర్తల అభివృద్ధి కోసం మరియు కార్యకర్తలకు ఏదైనా సమస్య ఉంటే పరిష్కారం అయ్యేంతవరకు నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో అందరు కలుపుకొని ముందు పోయి పార్టీ అభివృద్ధికి సేవ చేస్తారని తెలిపారు. నా నియమకానికి సహకరించిన మహబూబాబాద్ డీసీసీ అధ్యక్షులు జిన్నా రెడ్డి భరత్ చంద్ర రెడ్డి  మానుకోట ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ ఆదివాసి జాతీయ వైస్ ప్రెసిడెంట్ తేజావత్ బెల్లయ్య నాయక్ వైస్ పీపీజెల్ల వెంకటేష్ డీ సి సి ఉపాధ్యక్షులు గుగులోత్ బాలాజీ నాయక్ జిల్లా ప్రధాన కార్యదర్శి కాసo లక్ష్మారెడ్డి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నాయిని సత్యపాల్ రెడ్డి పిఎసిఎస్ డైరెక్టర్  రావుల సతీష్  గుగులోతు సురేష్ రాజు తదితరులు పాల్గొన్నారు.
Spread the love