రాష్ట్రస్థాయి బె స్ బాల్ పోటీలకు గురుకుల విద్యార్థులు

నవ తెలంగాణ  ఆర్మూర్:
హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ మైదానంలో  ఈ నెల 13 నుండి 14 వరకు జరిగే రాష్ట్రస్థాయి అండర్ 13 మేజర్ లీగ్  కప్ 2023 పోటీలకు  పట్టణంలోని గురుకుల విద్యార్థులు పాఠశాలకు చెందిన జ్ఞానేశ్వర్. వశీకరణ్. సుశాంత్. విగ్నేష్. కార్తికేయ. లవన్ కుమార్. సృజన్. అనిరుద్. సాత్విక్. విగ్నేష్. అక్షిత్ లు ఎంపిక కావడం జరిగింది. గత ఆగస్టు నెలలో పట్టణంలో జరిగిన జిల్లా స్థాయి పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని  ఈ సందర్భంగా బుధవారం విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపల్ ఏ. దుర్గారెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుల వైస్ ప్రిన్సిపల్ సంధ్యారాణి. శ్రీధర్. గంగాధర్. చిన్నయ్య. లక్ష్మీ ప్రసన్న. వ్యాయామ ఉపాధ్యాయులు కే. రాజేందర్ అర్జున్. సాఫ్ట్బాల్ అకాడమీ కోచ్ నరేష్  తదితరులు పాల్గొన్నారు. పాఠశాల ,కళాశాల బృందం సైతం అభినందించారు.
Spread the love