ఘనంగా ధన్వంతరి జయంతి..

– కింగ్ కోఠి ఆయుర్వేద పాలిక్లినిక్ లో ఉచిత వైద్య శిబిరం..
నవతెలంగాణ -సుల్తాన్ బజార్ 
తెలంగాణ ప్రభుత్వం ఆయుష్ శాఖ  కింగ్ కోఠి ప్రభుత్వ ఆయుర్వేద పాలి క్లినిక్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శ్రీ భగవాన్ ధన్వంతి జయంతి మీ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి కింగ్ కొఠి జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్రనాథ్ ముఖ్యఅతిథిగా పాల్గొని ర్యాలీని ప్రారంభించి పూజలు నిర్వహించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 8వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు – 2023 ఘనంగా నిర్వహిస్తున్నందుకు ఆయుర్వేద వైద్యులను అభినందించారు. అనంతరంఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ 2016 నుంచి ఈ ఉత్సవాలు నిర్వహింప బడుతున్నాయన్నారు. ఆయుర్వేదం వైద్యంపై ప్రజలకు నమ్మకం పెరిగిందన్నారు. 115 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందజేశారు. ఆయుర్వేద వైద్యం పూర్వకాలం నుంచి ప్రజల నమ్మకాన్ని పొందిందన్నారు. ఆయుర్వేద వైద్యం లో అన్ని వ్యాధులు నయం అవుతాయన్నారు. ఈ సందర్భంగా ప్రతిరోజు అందరికీ ఆయుర్వేదం, ఒక ఆరోగ్యం కోసం ఆయుర్వేదం అనే నినాదాలను ఆలపించి ధన్వంతరి చిత్రపటానికి పూలమాలవేసి పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాసరావు. డాక్టర్ రాందాస్, ఫార్మసిస్టు సంధ్య, వీరేందర్, యునాని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఉమేరా, ఏ ఆర్ టి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సవిత, జిల్లా వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
Spread the love