ఘనంగా గణతంత్ర దినోత్సవం

నవతెలంగాణ – అశ్వారావుపేట 

రాజ్యాంగం అమలు లోకి వచ్చిన సందర్భంగా ప్రతీ ఏడాది జనవరి 26 నిర్వహించే గణతంత్ర దినోత్సవాన్ని అశ్వారావుపేట నియోజక వర్గం వ్యాప్తంగా శుక్రవారం ఘనంగా నిర్వహించారు. నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేగా మొదటి సారి ఆదినారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.అనంతరం ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఆయిల్ఫెడ్ డివిజనల్ కార్యాలయంలో డి.ఒ బాల క్రిష్ణ,కొబ్బరి విత్తనోత్పత్తి క్షేత్రంలో ఉద్యాన అధికారి కిషోర్, వ్యవసాయ కళాశాలలో ఏడీ హేమంత్ కుమార్, తహశీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ క్రిష్ణ ప్రసాద్,మండల పరిషత్ కార్యాలయంలో ఎం.పి.డి.ఒ శ్రీనివాసరావు, పి ఆర్ కార్యాలయంలో డీ ఈ రామం, ఎన్పీడీసీఎల్ కార్యాలయంలో ఏడీఈ వెంకటేశ్వర్లు, పోలిస్ సర్కిల్ కార్యాలయంలో సీఐ కరుణాకర్, ఆబ్కారీ కార్యా లయంలో సీఐ నాగయ్యలు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
Spread the love