విఆర్ఏలకు ఇచ్చిన హామీ అమలుకు పచ్చ జెండా ఊపడం హర్షనియం..

– సీఎం కేసీఆర్, ఏమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ చిత్రపటానికి పాలాభిషేకం.
నవతెలంగాణ – డిచ్ పల్లి
ముఖ్యమంత్రి కెసిఆర్ 2020 లో కొత్త రెవెన్యూ చట్టం తెస్తున్న సందర్భంగా వి.ఆర్. ఓ. వ్యవస్థ రద్దు చేసిన సందర్భంగా నిండు అసెంబ్లీ సాక్షిగా స్వయానా ముఖ్యమంత్రి వి. ఆర్.ఏ.లకు పే స్కేల్ ,అర్హత కలిగిన వి.ఆర్.ఏ లకు పదోన్నతులు,55 సంవత్సరాలు దాటినా వి.ఆర్. ఏ ల వారసులకు ఉద్యోగాలు ఇస్తానని ముఖ్యమంత్రి వీఆర్ ఏలకు హామీ ఇచ్చి నారు.ఈ హామీ ఇచ్చి నేటికి రెండున్నర రెళ్ళకు అమలు నోచుకోలేదు. అందుకు నిరసనగా గత ఏడాది జూలై 25 న నిరవదిక సమ్మె చేశామని, ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదని సంఘం అధ్యక్షుడు వీరుడి గంగాధర్ అన్నారు. మంత్రి కేటిఅర్ చర్చలకు పిలిచి త్వరలో మీ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.గురువారం సీఎం కేసీఆర్ క్యాబినెట్ సమావేశంలో వీఆర్ఎలకు పే స్కేల్ పై ఆమోదం తెలిపినందున డిచ్ పల్లి మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఎల సంఘం అధ్యక్షులు నీరడి. గంగాధర్, ప్రధాన కార్యదర్శి దండు.సూర్య రాజ్, ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి టపాకాయలు కాల్చి స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల వీఆర్ ఏలు పాల్గొన్నారు.

Spread the love