ఛత్తీస్‌గఢ్ టూ తెలంగాణ ఇసుక లారీలో టేకు కలప

–  రూ.15 లక్షల కలప పట్టివేత
– డ్రైవర్ ఫరార్
– అటవీ సిబ్బంది తో
-వెంకటాపురం అటవీశాఖ కార్యాలయానికి తరలింపు
నవతెలంగాణ – వెంకటాపురం
పుష్ప సినిమాను తల దన్నేల అక్రమ కలప వ్యాపారానికి పాల్పడ్డాడు ఓ అక్రమార్కుడు.ఏజన్సీలో ఇసుక క్వారీలో ఇసుక తరలిస్తున్న లారీలపై నిఘా లేకపోవడం.జిల్లా అధికారులు లారీలను ఎక్కడా తనిఖీ చేయకపోవడం గుర్తించిన ఓ లారీ యజమాని ఈ దనర్జనే లక్ష్యం అక్రమ కల కలప వ్యాపారానికి తెరలేపినట్లు తెలుస్తుంది. చెత్తిస్ఘడ్ రాష్ట్రం నుంచి ఇసుక తరలింపు పేరుతో తెలంగాణకు బారి స్థాయిలో అక్రమ టకుకలప రవాణా జరుగుతున్నట్లు వెంకటాపురం అటవీశాఖ అధికారుల కు సమాచారం అందింది.విశ్వసనీయ సమాచారం మేరకు ములుగు జిల్లా వెంకటాపురం అటవీశాఖ అధికారి చంద్రమోలి ఆధ్వర్యంలో అటవీశాఖ సిబ్బంది వాజేడు మండలం లోటపేట గండి సమీపంలోని తెలంగాణ సరిహద్దుల్లో కాపు గాసారు . ఛత్తీస్ఘడ్ రాష్ట్రం నుంచి తెలంగాణకు ఇసుక లోడుతో వస్తున్న ఏపీ 16 టీబీ 5757 నెంబర్ గల లారీ ని తనిఖీ చేసేందు అటవీశాఖ అధికారులు ప్రయత్నం చేశారు.అది గమనించిన లారీ డ్రైవర్, క్లినర్ పరారీ అయినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.అనుమానం వచ్చిన అటవీశాఖ అధికారులు ఇసుకను తొలగించగా బారి స్థాయిలో టేకు కలప ఉన్నట్లు గుర్తించారు.సెక్షన్ అధికారి నారాయణ సహాయం తో లారీని వెంకటాపురం అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. 12 టైర్ల లారీలో టేకుకలప దుంగలు,చెక్కలు పేర్చి అనుమానం రాకుండా వాటిపైన ఇసుకను పోశారు. అనుమానం రాకుండా పైన బరకం వేశారు.పగడ్బంది గా ఛత్తీస్ ఘడ్ నుంచి తెలంగాణ కు అక్రమ కలప రవాణా కు తెగబడ్డాడు. పట్టు బడ్డ కలప విలువ సుమారు రూ.15 లక్ష లకు పైగా ఉంటుందని అటవీశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.లారీ ని వొదిలి డ్రైవర్ పరారీ కావడం తో లారీ ఎవరిది.ఎక్కడ నుండి వచ్చింది,ఎన్ని సంవత్సరాలు గా అక్రమ కలప రవాణా జరుగుతుంది. అని అటవీశాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. లారీ పై ములుగు జిల్లా లారీ అసోసియేషన్ అని స్టీక్కర్ ఉండటం తో ములుగు జిల్లాలోని ఒక మండలం కు చెందిన లారిగా అధికారు నిర్దారించు కొని విచారణ చేపట్టారు.ఈ దాడుల్లో వికాస్,ప్రసాదరావు, జగన్, హరిప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.

 

Spread the love