నవతెలంగాణ- ఖమ్మం
ఈనెల 9 నుండి 11వ తేదీ వరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ లో జరిగిన 6 వ తెలంగాణ రాష్ట్రస్థాయి నెట్ బాల్ మెన్ అండ్ ఉమెన్ పోటీలలో ఖమ్మం జిల్లా బాలికల జట్టులో హార్వెస్ట్ విద్యార్ధిని ఆర్. లాస్య (12వ తరగతి) , బాలుర జట్టులో కె. లోకేష్ ( ప్లస్ 1 ఎంపిసి), ఆర్. దివాకర్ (ప్లస్ 1 సిఇసి) లు పాల్గొన్నారు. ఈ పోటీలకు తెలంగాణ రాష్ట్రం నుండి 26 జిల్లాల నుండి విద్యార్థినీ, విద్యార్థులు పోటీపడగా హార్వెస్ట్ పాఠశాల విద్యార్థులు మెన్ అండ్ ఉమెన్ విభాగాలలో రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతి సాధించడం జరిగిందని హార్వెస్ట్ విద్యాసంస్థల కరస్పాండెంట్ పి.రవిమారుత్, ప్రిన్సిపల్ ఆర్.పార్వతీ రెడ్డి తెలిపారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రస్థాయిలో రాణించి ఖమ్మం జిల్లా జట్టును స్టేట్ లెవల్లో ప్రథమస్థానంలో నిలపడంలో వీరి కృషికి అభినందిస్తూ, చదువుతోపాటు క్రీడలు ఎంతో ముఖ్యమని అటు శారీరక వ్యాయామాన్ని, మరోవైపు భవిష్యత్తులో చక్కటి పురోభివృద్ధికి ఉపయుక్తంగా ఉటుందని విద్యార్థినీ, విద్యార్థులను అభినందిస్తూ భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించాలని అభిలషించారు. ఇందుకు ప్రోత్సాహాన్ని అందించిన శిక్షకులను , తల్లిదండ్రులను అభినందించారు.