నెగిటీవ్ రివ్యూ ఇచ్చారని చితకొట్టారు..

నవతెలంగాణ – తమిళనాడు: తమిళ స్టార్ హీరో రజనీకాంత్ హీరోగా వచ్చిన జైలర్ సినిమా ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు ఆడియన్స్ నుండి యునానిమస్ పాజిటీవ్ టాక్ వచ్చింది. ఒకటి రెండు సీన్స్ మినహాయిస్తే సినిమా బ్లాక్ బస్టర్ అంటూ సంబరాలు చేసుకుంటున్నారు రజని ఫ్యాన్స్. అయితే ఈ క్రమంలో కొంత మంది ఏ సినిమాకు కావాలనే నెగిటీవ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారని రజని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అంతేకాదు జైలర్ సినిమాకు నెగిటీవ్ రివ్యూ ఇచ్చారని కొందరు వ్యక్తులను చితక బాదారు రజనీకాంత్ ఫ్యాన్స్ ఈ సంఘటన చెన్నైలోని వెట్రి థియేటర్ వ‌ద్ద చోటుచేసుకుంది. జైలర్ షో మిగిసాక సినిమా ఎలా ఉందని విలేక‌రులు రివ్యూలు అడగగా.. సదరు వ్యక్తులు తమకు నచ్చలేదని. అస్సులు బాగోలేదని చెప్పుకొచ్చారు. అది విని కోపంతో ఊగిపోయిన ర‌జనీకాంత్ ఫ్యాన్స్.. ఆ వ్యక్తులను కొట్టారు. ఆ ఇద్దరు విజయ్ ఫ్యాన్స్ అని కావాలనే రజని సినిమాను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని రజని ఫ్యాన్స్ ఆరోపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.

Spread the love