ప్రభుత్వ ఉద్యోగం చేసి తల్లిదండ్రులకు అండగా ఉంటా

– జూనియర్ ఇంటర్ ఫలితాలలో రాష్ట్రస్థాయి మొదటి స్థాయి మార్కులు సాధించిన కావ్య

నవతెలంగాణ – సిద్దిపేట
భవిష్యత్తులో మంచి ప్రభుత్వ ఉద్యోగం చేసి తల్లిదండ్రులకు అండగా ఉంటానని సుతారి కావ్య తెలిపారు. బుధవారం వెలువడిన ఇంటర్ ఫలితాలలో తొగుట గ్రామానికి చెందిన సుతారి కావ్య ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ లో 470కి గాను 468 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారు. పట్టణంలోని మాస్టర్ మైండ్ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతుంది. ఈమే తండ్రి దేవేందర్ ఓ ప్రైవేట్ బీడీ కంపెనీలో టేకేదారుగా పనిచేస్తున్నారు. తల్లి లావణ్య హౌస్ వైఫ్ గా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా దేవేందర్ మాట్లాడుతూ తమ కూతురు రాష్ట్రస్థాయిలో మెదటి స్థానంలో మార్కులు సాధించడం సంతోషంగా ఉందన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ పిల్లల చదివే ముఖ్యమని, వారికి మంచి విద్యను అందించడానికి కష్టపడుతున్నట్లు ఆయన తెలిపారు. తాము తొగుటలో ఉంటూ ఇద్దరు కుమారులు, కూతురు కోసం సిద్దిపేటలో రూము కిరాయి తీసుకొని చదివిస్తున్నామని తెలిపారు. తమ నమ్మకాన్ని నిలబెట్టినందుకు సంతోషంగా ఉందన్నారు.
Spread the love