నందనంలో హెల్త్ క్యాంప్..

నవతెలంగాణ – ఐనవోలు
మండలంలోని నందనం గ్రామంలో ప్రైవేట్ హాస్పటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన హెల్త్ క్యాంప్ కార్యక్రమంలో భాగస్తులై సీజనల్ ఫీవర్, దోమ కాటు వల్ల వచ్చే డెంగ్యూ, మలేరియా,చికెన్ గున్యా , టైఫాయిడ్, మరి ఇతర వ్యాధులు సోకే ప్రమాదం ఉందని ఈ వ్యాధుల భారీన పడకుండా ప్రజలు అప్రమత్తం ఉండాలి.  మానవతా సేవా దృక్పథంతో ప్రైవేట్ హాస్పటల్ వారు ఉచితంగా దాదాపు 50 వేల రూపాయలు విలువచేసే మందులతో నిర్వహించిన హెల్త్ క్యాంపుకు ప్రతి ఒక్కరూ హాజరై ఆరోగ్యనికి సంబంధించిన పరీక్షలు, ఉచిత మందులను పంపిణీ చేసారు. హాస్పిటల్ యాజమాన్యానికి డాక్టర్లు,సిబ్బందికి సహాయ సహకారాలు అందించిన ఐనవోలు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సమ్మెట మహేందర్ గౌడ్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు యాకర సాంబయ్య, వార్డు మెంబర్లు న్యాలం సంపత్ ,కాహిత ఏకాంబరం, ఊళ్లేంగల రవి గ్రామ నాయకులు బుర్ర కుమారస్వామి,యూత్ నాయకులు దోమకొండ హరీష్ మరియు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొని ప్రైవేట్ సౌజన్యం వారు నిర్వహిస్తున్న హెల్త్ క్యాంపు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Spread the love