Thursday, August 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాచాపూర్‌లో ఆరోగ్య శిబిరం

కాచాపూర్‌లో ఆరోగ్య శిబిరం

- Advertisement -

నవతెలంగాణ -భిక్కనూర్
మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మెడికల్ అధికారి యేమిమా ఆదేశాల మేరకు కాచాపూర్ గ్రామంలో ఆరోగ్య శిబిరం నిర్వహించారు. 30 ఏళ్లు పైబడిన వయోజనులకు అక్కడికక్కడే వైద్య సేవలు, ఆర్‌డీటీ పరీక్షలు నిర్వహించారు. మలేరియా, డెంగ్యూ, డయేరియా, చర్మ వ్యాధులు, టిబి తదితర వ్యాధులపై అవగాహన కల్పించారు. అలాగే ఎన్‌సిడి స్క్రీనింగ్‌పై ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జ్యోతి సంతోష్ గౌడ్, ఆరోగ్య కార్యకర్త శ్యామల, ఆశా కార్యకర్తలు ఇందిరా, సంగీత, విజయ తదితరులు  పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -