నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు మండలం తూర్పుగూడెం గ్రామంలో సర్పంచ్ దూపటి లక్ష్మీ వెంకటేష్ ఆధ్వర్యంలో శ్రీ వినాయక ఫౌండేషన్,మెడిసిటీ హాస్పిటల్స్ సహకారంతో గురువారం నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి గ్రామీణ ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా సర్పంచ్ దూపటి లక్ష్మీ వెంకటేష్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని సూచించారు.
శిబిరంలో మెడిసిటీ హాస్పిటల్స్ వైద్య నిపుణులు పాల్గొని ప్రజలకు వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీ, షుగర్‌తో పాటు గుండె,కంటి,దంత,చర్మ,కీళ్ల సమస్యలు తదితర ఆరోగ్య సమస్యలకు పరీక్షలు చేసి, అవసరమైన వారికి వైద్యులు తగిన సూచనలు, సలహాలు అందించారు. గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు సహకరించిన మెడిసిటీ హాస్పిటల్స్ వైద్య బృందానికి సర్పంచ్ కృతజ్ఞతలు తెలిపారు. ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవడం పట్ల నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ దూపటి లక్ష్మీ వెంకటేష్, ఉప సర్పంచ్ బాల స్టార్విన్,గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ దూపటి వెంకటేష్, వార్డు మెంబర్లు దూడల నరేష్ ఎదుల సందీప్, కారో బార్ హరిపుష్పం,గ్రామస్థులు రాములు లింగమయ్య,సోమయ్య,శ్రీను,ఐలయ్య, ఉప్పలయ్య,మెడిసిటీ హాస్పిటల్ బాధ్యులు పవన్,సంజీవ,రాజు తదితరులు పాల్గొన్నారు.



