యూనివర్సిటీలో హెల్త్ కేర్ సమస్యలు పరిష్కరించాలి..

– పి.డి.ఎస్.యూ..
నవతెలంగాణ- డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ లో హెల్త్ కేర్ సమస్యలు పరిష్కరించాలని యూనివర్సిటీ పి.డి.ఎస్.యూ నాయకులు మోహిత్,శివసాయి, రవీందర్ లు అన్నారు.
గురువారం యూనివర్సిటీ లో ఉన్న హెల్త్ కేర్ సెంటర్ ముందు యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూనివర్సిటీ లో హెల్త్ కేర్ సెంటర్  నిత్యం తెరచి ఉండటం లేదని ,  స్టాఫ్ రావటం లేదని , అన్ని రకాల రోగాలకు మందులు లేవని ,ఏదైన ఎమర్జెన్సీ వస్తే నిజామాబాద్ వెళ్లి చూయించుకోవాల్సిన పరిస్థితి నెలకొందని , యూనివర్సిటీ హెల్త్ కేర్ లో రాత్రి లో మెల్ నర్స్ ను ఉంచాలని , అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి ప్రిన్స్ యూనివర్సిటీ పి.డి.ఎస్.యూ నాయకులు ఆకాష్, అక్షయ్, హన్మాండ్లు, గంగూలీ, నర్సింలు, యశ్వంత్, సాయిరాం తదితరులు పాల్గొన్నారు.
Spread the love