అల్లంతో ఆరోగ్యం…

అల్లంతో ఆరోగ్యం...ప్రకృతి ప్రసాదించిన వన మూలికల్లో అల్లం ఒకటి. ఈ అల్లంతో అద్భుతమైన వైద్యం చేయ వచ్చని నిపుణులు చెపుతారు. పసిపిల్లలున్న ఇంట్లో అల్లం, శొంఠి ఉండడం ఆనవాయితీ. మీ ఉదయాన్ని మీరు అల్లంతో ప్రారంభించాలి, ఎందుకంటే.. రోజువారీ మోతాదు విటమిన్‌ సి కోసం అల్లం టీ తాగితే సరిపోతుంది. కొద్దిపాటి అల్లం రసం తాగితే జీవక్రియను పెంచడంతోపాటు బ్యాక్టీరియా శరీరం లోకి ప్రవేశించలేదు. అల్లం సహజ నొప్పి నివారిణి, ప్రత్యేకంగా వ్యాయామం-ప్రేరిత కండరాల నొప్పి, ఋతు నొప్పిని అడ్డుకుంటుంది. పసుపు, అల్లం కలిపిన పాలు తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

Spread the love