థైరాయిడ్‌తో బాధపడుతున్నారా..

థైరాయిడ్‌తో బాధపడుతున్నారా..బరువులో హెచ్చుతగ్గులు, కుంగుబాటు, జుట్టు రాలడం, ఇవన్నీ థైరాయిడ్‌ లోపంతో వచ్చే సమస్యలు. అయోడిన్‌ లోపంతోపాటు జన్యువులు కూడా థైరాయిడ్‌ సమస్యకు కారణం అవుతాయి. పదిమంది మహిళల్లో నలుగురు థైరాయిడ్‌ సమస్య బారినపడతారని ఓ అంచనా! ఈ సమస్య ఎదురైతే ఈ జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. జీర్ణాశయంలో ఉండే మంచి బ్యాక్టీరి యాను కాపాడు కోవాలి. పీచు పదార్థాలు తినడం, పెరుగులాంటి ప్రోబయా టిక్స్‌ తీసు కోవడం, తీపికి దూరం గా ఉండటం వల్ల పొట్టలో బ్యాక్టీరియా బాగుండి థైరాయిడ్‌ దుష్ప్రభావం తక్కువగా ఉంటుంది. ప్రొటీన్స్‌ అధిక మోతాదులో ఉండే ఆహారం తీసుకోవడం వల్ల థైరాయిడ్‌ హార్మోన్‌ కణాలకు అందుతుంది. ఇందుకోసం గుడ్లు, చేపలు, సోయామిల్క్‌ లాంటివి తీసుకోవచ్చు. క్యాబేజి, క్యాలిఫ్లవర్‌, పాలకూర, సోయాబీన్స్‌, వేరుశనగలాంటి కొన్ని పదార్థాలను గాయిట్రోజన్స్‌ అంటారు. ఇవి అయోడిన్‌ శరీరానికి అందకుండా చేస్తాయి. ఫలితంగా థైరాయిడ్‌ సమస్య పెరగవచ్చు.

Spread the love