మట్టికుండ నీరు..

మట్టికుండ నీరు..వేసవిలో చల్లని నీటికి ఆవాసంగా ఉండడంతో పాటు బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది మట్టి కుండ. ఒకప్పుడు మన ఇళ్లల్లో మట్టి పాత్రలను విరివిగా ఉపయోగించేవారు. ఇప్పుడు వాటి వినియోగం తగ్గింది. కానీ, వేసవిలో మాత్రం తాగునీటి కోసం కుండలను ఉపయోగిస్తున్నవారు ఇప్పటికీ ఉన్నారు. వేసవిలో కుండ నీరు చల్లగా అవటానికిగాను ఇళ్లల్లోనూ, చలివేంద్రాల వద్ద కింద ఇసుక పోసి, అందులో కుండ పెడతారు. దాని చుట్టూ గుడ్డ పెట్టి అప్పుడప్పుడూ తడుపుకుంటూ ఉంటే ఆ కుండలోని నీరు చల్లబడుతుంది. ఆ నీరు తాగితే ఆహ్లాదకరంగా ఉంటుంది.
ఫ్యూరిఫైడ్‌ నీటితో సమానం
కుండలో పోసిన నీళ్లు నూరు శాతం ఫ్యూరిఫైడ్‌ చేసిన నీటితో సమానమని నిపుణులు చెబుతున్నారు. ఈ నీటిని తాగటం వల్ల పలు అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. నీటిలో ఉండే మలినాలను పీల్చుకునే శక్తి కుండకు ఉంటుంది. మట్టి కుండల్లోని నీళ్లు సహజ మినరల్స్‌, ఎలక్ట్రోలైట్స్‌ కోల్పోకుండా ఉంటాయి. పోషకాలు, ఖనిజ లవణాలు వృథా కాకుండా ఉంటాయి. కుండ నీటిలో సహజ సిద్ధమైన ఆల్కలిన్లు యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. శరీరంలోని టాక్సీన్లను బయటకు నెట్టేస్తాయి. శరీరంలోని పిహెచ్‌ విలువను స్థిరంగా ఉండటంలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి.

Spread the love