CSK vs LSG : గైక్వాడ్ అధ్భుత సెంచరీ..ల‌క్నో టార్గెట్..?

నవతెలంగాణ-హైదరాబాద్ : సొంత‌గ‌డ్డ‌పై తిరుగులేని చెన్నై సూప‌ర్ కింగ్స్ భారీ స్కోర్ చేసింది. చెపాక్ స్టేడియంలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(108 నాటౌట్)సెంచ‌రీతో చెల‌రేగ‌గా.. సిక్స‌ర్ల శివం దూబే(66) త‌న త‌ర‌హాలో రెచ్చిపోయాడు. దాంతో, సీఎస్కే 4 వికెట్ల న‌ష్టానికి 210 ర‌న్స్ కొట్టింది. టాపార్డ‌ర్ విఫ‌ల‌మైనా.. గైక్వాడ్ ఆక‌లిగొన్న పులిలా లక్నో సూపర్ జెయింట్స్ బౌల‌ర్లపై విరుచుకుప‌డ్డాడు. ర‌వీంద్ర జ‌డేజా(16)తో మూడో వికెట్‌కు 50 ప్ల‌స్ ప‌రుగులు జోడించిన గైక్వాడ్.. ఇక‌ దూబేతో చెన్నై స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించాడు. దాంతో, సీఎస్కే క‌ష్ట‌మైన పిచ్‌పై ల‌క్నోకు భారీ టార్గెట్ నిర్దేశించింది. ప‌దిహేడో సీజ‌న్‌లో ఓపెనింగ్ స‌మ‌స్య‌తో ఇబ్బంది ప‌డ‌తున్న చెన్నైకి ల‌క్నో పేస‌ర్ హెన్రీ ఆదిలోనే షాకిచ్చాడు. ఇన్నింగ్స్‌ మొద‌టి ఓవ‌ర్‌లోనే ఆఖ‌రి బంతికి అజింక్యా ర‌హానే()ను ఔట్ చేశాడు. 4 ప‌రుగుల‌కే తొలి వికెట్ ప‌డిన ద‌శ‌లో వ‌చ్చిన డారిల్ మిచెల్(11) స్వ‌ల్ప స్కోర్‌కే వెనుదిర‌గ‌గా.. జ‌డేజా(16)తో క‌లిసి గైక్వాడ్ ఇన్నింగ్స్ నిర్మించాడు. అయితే.. మొహ్సిన్ ఖాన్ ఓవ‌ర్‌లో జ‌డ్డూ స్లో డెలివ‌రీని అంచ‌నా వేయ‌లేక‌ వికెట్ పారుసుకున్నాడు.

Spread the love