పోషకాహార నాయిక‌లు

Nutrition heroinesమన దేశంలో గర్భిణులు తీవ్ర రక్తహీనతతో బాధపడుతున్నారు. వారి బిడ్డలు కూడా అదే సమస్యతో ఈ భూమ్మీదకు వస్తున్నారు. ఫలితంగా దేశం అనారోగ్య భారతంగా మారిపోతోందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాంటి సమస్య నుండే బయటపడేందుకు, పోషకాహార లోపంతో పోరాడేందుకు ఒడిశాలోని గిరిజన మహిళలు ముందుకు వచ్చారు. విటమిన్‌ ఏంజెల్స్‌ ఇండియా ద్వారా శిక్షణ పొందిన ఈ మహిళలు తమ కుటుంబంతో పాటు గ్రామాలను కూడా అరోగ్యంగా తీర్చిదిద్దుతున్నారు.
సుమతి ప్రధాన్‌ తన 20 మంది సభ్యుల కుటుంబాన్ని చూసుకోవడానికి ప్రతిరోజూ తెల్లవారుజామున 4 గంటలకు మేల్కొంటుంది. 22 ఏండ్ల ఆమె వంట చేసి ఇంటిని శుభ్రపరుస్తుంది. అయితే ఆమె ఒడిశాలోని టెంబ్లీ గ్రామంలోని తన పొరుగువారి వంటశాలలలో ఎక్కువ సమయం గడుపుతుంది. ఇతర కుటుంబాలను తనిఖీ చేస్తుంది, వారు ఏమి తిన్నారో అడుగుతుంది. అలాగే కిచెన్‌ గార్డెన్‌లను చూసుకోవడంలో వారికి సహాయం చేస్తుంది. సుమతి పోషకాహార లోపంతో పోరాడటానికి శిక్షణ పొందిన ఒక పోషణ్‌ మాయెలీ (పోషకాహార నాయకురాలు). ఒడిశాలోని కంధమాల్‌ జిల్లాలోని గిరిజన మహిళలతో సహా బలహీన వర్గాల్లో పోషకాహార లోపాన్ని పరిష్కరించడానికి ముంబైకి చెందిన నాన్‌-ప్రాఫిట్‌ విటమిన్‌ ఏంజెల్స్‌ ఇండియా(వీఏఐ) ఆధ్వర్యంలో శిక్షణ పొందిన ఎనిమిది మంది మహిళల్లో ఆమె కూడా ఒకరు.
తీవ్ర రక్తహీనతతో…
పాఠశాల నుండి గ్రాడ్యుయేట్‌ విద్యను పూర్తి చేసిన కొద్దిమంది స్త్రీలలో సుమతి పోషన్‌ మయెలీ కావడానికి ఆ సంఘంచే ఎన్నుకోబడింది. మార్చి 2023లో వీఏఐ ఒక కార్యక్రమం కోసం కంధమాల్‌ జిల్లాను సందర్శించింది. టెంబ్లి, కంజుమహా, పాడామి అనే మూడు గ్రామాలలో గర్భిణీలు తీవ్ర రక్తహీనతతో బాధపడుతున్నారని కనుగొన్నారు. ‘ఈ ప్రాంతం సహజంగా అనుకూలమైనది. అత్తి పండ్లు, ఖర్జూరం, చింతపండు, పసుపుతో సహా పోషకాలు అధికంగా ఉండే ఉత్పత్తులు ఇక్కడ సమృద్ధిగా ఉంటాయి. కానీ ఇక్కడ నివసిస్తున్న గిరిజన ప్రజలకు వాటిని తమ ఆహారంలో చేర్చుకోవాలనే అవగాహన లేదు. తరతరాలుగా వారు అన్నంలో ఉప్పు లేదా కారం కలుపుకుని తింటున్నారు’ అని సంస్థ సీనియర్‌ మేనేజర్‌ రమేష్‌ రారు అంటున్నారు.
స్థిరమైన మార్పుకై…
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 ప్రకారం 2019 – 2020 మధ్య కంధమాల్‌ జిల్లాలో 53.4శాతం గర్భిణీలు రక్తహీనతతో ఉన్నారు. పోషకాహార లోపంతో పాటు ఆరోగ్య సంరక్షణ, విద్య వారికి అందుబాటులో లేనందున ఇతర సామాజిక నిర్ణయాధికారులలో కూడా ఈ ప్రాంతంలోని గ్రామాలు వెనకబడి ఉన్నాయి. ‘సమీప ఆసుపత్రి 40 కి.మీ దూరంలో ఉంది. పాఠశాలల్లో పిల్లల సంఖ్య అత్యంత తక్కువ. పిల్లలు బడికి చేరుకోవడానికి 6-7 కి.మీ దూరం నడవాలి. అక్కడ వెంటనే స్థిరమైన మార్పుకై పని చేయాలని నిర్ణయించుకున్నాం’ అని రారు అంటున్నారు.
పరిశోధనల ప్రకారం…
గత రెండు దశాబ్దాలుగా భారతదేశంలో ప్రీస్కూల్‌ పిల్లలలో పోషకాహార లోపం క్రమంగా పెరుగుతోంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే డేటా ప్రకారం ఇది 2005-2006లో 6.6శాతం నుండి 2015-2016లో 7.5శాతానికి పెరిగింది. 2022లో ఐఐటి మద్రాస్‌కి చెందిన పరిశోధకుల బృందం భారతదేశంలో తల్లి, పిల్లల పోషకాహారలోపం అత్యంత తీవ్రమైన ఆరోగ్య ప్రమాదం అని కనుగొన్నారు. ఇది దేశ మొత్తం వ్యాధి భారంలో 15శాతం. పునరుత్పత్తి వయసులో ఉన్న మహిళల్లో రక్తహీనత ఎక్కువగా ఉందని, పోషణ విషయంలో భారతదేశం వెనుకబడి ఉందని వారి అధ్యయనం వెల్లడించింది. పోషకాహార లోపం ఉన్న తల్లి అటువంటి బిడ్డకే జన్మనిస్తుంది. ఇది ఒక చక్రంలా మారిపోతోంది.
ఇంటర్నెట్‌కు దూరంగా…
కార్యక్రమాన్ని అమలు చేయడానికి వీఏఐ స్థానిక ఎన్‌జీఓతో భాగస్వామ్యం పొందింది. ఈ ప్రాంతాన్ని సర్వే చేయడం, ఛాయాచిత్రాలు తీయడం, అడవులలో పండే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలను ఆహారంగా తీసుకోవడం ద్వారా ఎన్‌జీఓ కొత్త వంటకాలను స్థానికులకు పరిచయం చేసింది. ‘ఈ కార్యక్రమంలో మేము కావాలనే ఇంటర్నెట్‌కు దూరంగా ఉన్నాము. ఎందుకంటే గ్రామస్తులు ఇష్టపడే సంస్కృతికి వారిని దూరం చేయకూడదనుకున్నాము. కమ్యూనిటీ కిచెన్‌లలో ఫుడ్‌ ఫెస్టివల్స్‌ నిర్వహించి మెరుగైన ఆహార పద్ధతులను అవలంబించడంలో వారికి సహాయపడతాము’ అని ఎన్‌జీఓతో కలిసి పనిచేస్తున్న దిన్‌బంధు మహారాణా చెప్పారు.
మార్పు అందుబాటులో ఉంది
పోషన్‌ మాలీస్‌లు వారి సొంత కుటుంబాలను జాగ్రత్తగా చూసుకోవడంతో పాటు మెరుగైన ఆరోగ్యం వైపు వారి కమ్యూనిటీలను నడిపారు. అయితే పోషకాలు అధికంగా ఉండే ఆహారాలకు మారిన తర్వాత గ్రామస్తుల ఆరోగ్యం మెరుగుపడింది. ‘నాయకులుగా మొదట మన ఇళ్లలో మార్పును ప్రేరేపించాలి. ప్రతి స్త్రీ లేత పసుపు కళ్లతో, తీవ్రమైన అలసట, ఇమ్యునో డిఫిషియెన్సీతో పోరాడిన సమయం నుండి వారు ఇప్పుడు మార్పు సాధ్యమని, ముఖ్యంగా అందుబాటులో ఉందని నమ్ముతున్నారు. ఇప్పుడు నేను దీని కోసం గడిపే సమయం చాలా పెరిగింది. కానీ వస్తున్న మార్పు నన్ను ఉత్తేజరపరుస్తుంది’ అని టెంబ్లీకి చెందిన మరో పోషన్‌ మయెలీ రుటా ప్రధాన్‌ చెప్పారు.
ఓ ఉద్యమంలా…
గత ఏడాది సుమతితో సహా మహిళలకు ఈ ప్రాంతంలో స్థానికంగా పండించే పండ్లు, కూరగాయలను తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను గుర్తించేందుకు వీఏఐ శిక్షణ ఇచ్చింది. క్యారెట్‌, బీన్స్‌, ముల్లంగి, టమోటాలు, బచ్చలికూర, మునగకాయలు వంటి కూరగాయలను సమిష్టిగా పండించడంలో ఇప్పటి వరకు ఎనిమిది మంది పోషన్‌ మాలీస్‌లకు శిక్షణ ఇచ్చింది. కార్యక్రమం ప్రారంభంలో వీఏఐ సేంద్రీయ విత్తనాలను అందించింది. ఇది గ్రామాలలో మహిళా నేతృత్వంలోని స్వయం సహాయక సంఘాలచే ఓ ఉద్యమాన్ని ప్రారంభించింది.
తీవ్రమైన పరిస్థితుల్లో…
‘మేము మహిళలకు పెద్ద సమూ హాలలో శిక్షణ ఇవ్వాలని కూడా ఎంచుకున్నాము. ఇది ఆలోచనలను మార్పిడి చేసుకోవడానికి, వంటశాల లలో నేర్చుకున్న వాటితో ప్రయోగాలు చేయడానికి వారిని ప్రేరేపించింది. ఒడియా చదవగలిగే, అత్యంత విద్యావంతులైన మహిళలు పోషన్‌ మాలీస్‌గా ఎన్నిక య్యారు’ అని మహారాణా చెప్పారు. వీఏఐ కార్యక్రమం కేవలం గ్రామస్థులు తినే విధానాన్ని మాత్రమే మార్చలేదని సుమతి చెప్పారు. ‘ఆహారం నిజంగా మా ప్రాధాన్యతలో లేదు. ప్రాథమిక పరిశుభ్రతపై కూడా మాకు అవగాహన లేదు. అనారో గ్యాలు వచ్చినా అడవుల్లో లభించే సహజ మూలికలపై ఆధారపడతాము. తీవ్రమైన పరిస్థితుల్లో మత గురువుల నుండి సహాయం తీసుకుంటాము’ ఆమె చెప్పారు.

Spread the love