ఆరోగ్య సిబ్బంది సమయ పాలన పాటించాలి

 – భూపాలపల్లి జిల్లా వైద్యాధికారి మధుసూదన్
నవ తెలంగాణ- మల్హర్ రావు: మండల కేంద్రమైన తాడిచెర్లలోని. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య వైద్య సిబ్బంది సమయ పాలన పాటించాలని భూపాలపల్లి జిల్లా వైద్యాధికారి మధుసూదన్ ఆదేశించారు. గురువారం డిఎండిహెచ్ఓ ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఒపి రిజిస్టర్, ఆరోగ్య సిబ్బంది హాజరు  రిజిస్టర్లను పరిశీలించారు. రోగులకు గ్లూకోజ్ పెట్టు, ల్యాబ్, మందులిచ్చే తదితర గదులను పరిశీలించారు. అనంతరం సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. సిబ్బంది 24 గంటలు ఆరోగ్య కేంద్రములో ఉంటూ ప్రజాలకు వైద్య సేవలందించాలన్నారు. లేదంటే శాఖ పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా వైద్యాధికారి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి  ఆరోగ్య కేంద్రానికి మొదటిసారిగా వచ్చిన సందర్భంగా సిబ్బంది శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎండిహెచ్ఓ కొమురయ్య, పోగ్రామ్ అధికారి అన్వేషణ, మండల వైద్యాధికారి రాజు,డిడిఎమ్ మధుబాబు, సిసి దినేష్, ఏపడామిక్ టీం, ఏఎన్ఎం, ఆశాలు పాల్గొన్నారు.
Spread the love