ప్రస్తుత రోజుల్లో పాఠశాలకు వెళ్లే పిల్లలకు, ముఖ్యంగా కొత్తగా బడికి వెళ్లే చిన్నారులకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అలవాటు చేయడం చాలా ముఖ్యం. వారు ఇష్టపడే విధంగా పోషక విలువలున్న ఆహారాన్ని అందించాలి. అయితే, ఏ రకమైన ఆరోగ్యకరమైన ఆహారాలు పిల్లలకు ఇవ్వాలి అనే విషయంలో తల్లులకు తరచుగా సందేహాలు వస్తుంటాయి. పిల్లల ఎదుగుదలకు, మేధస్సు వికాసానికి సరైన ఆహారం చాలా అవసరం. అందుకే, పాఠశాలకు వెళ్లే పిల్లలకు పోషకాలు నిండిన కొన్ని ముఖ్యమైన ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గుడ్డు : ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచేది గుడ్డు. గుడ్డులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది పిల్లల జ్ఞాపకశక్తిని పెంచడానికి అద్భుతంగా సహాయపడుతుంది. అంతేకాకుండా, పిల్లలకు కండరాల పటుత్వాన్ని అందించడంలో గుడ్డు కీలక పాత్ర పోషిస్తుంది. ఉదయం అల్పాహారంలో గుడ్డును చేర్చడం వల్ల వారికి రోజంతా శక్తి లభిస్తుంది. ఉడకబెట్టిన గుడ్డు, ఆమ్లెట్ లేదా గుడ్డు ఫ్రై వంటి రూపాల్లో పిల్లలకు అందించవచ్చు. వేరుశనగలు, రాగులు: ఇవి సులభంగా లభించే ఆహార పదార్థాలు. వేరుశనగలలో జింక్, విటమిన్ E పుష్కలంగా ఉంటాయి. ఇవి పిల్లలకు అద్భుతమైన ఆహారం. వీటిని స్నాక్స్‌గా లేదా పొడిగా చేసి వివిధ వంటకాలలో కలిపి ఇవ్వవచ్చు. వేరుశనగలు మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. చేపలు: చేపలలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పిల్లల మెదడు అభివృద్ధికి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అలాగే, చేపలలో విటమిన్ డి, ఎముకల బలానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పిల్లలు చేపలను ఇష్టపడితే, వారానికి 2 నుంచి 3 సార్లు పెట్టొచ్చు.
పండ్లు: పండ్లలో అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి పిల్లల రోగనిరోధక శక్తిని పెంచి, వ్యాధుల బారి నుంచి రక్షిస్తాయి. అలాగే, ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరు స్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. అరటిపండ్లు, ఆపిల్, నారింజ, బెర్రీలు వంటివి పిల్లలకు రోజూ అందించడం వల్ల వారికి అవసరమైన విటమిన్లు, మినరల్స్ అందుతాయి.
పిల్లలకు ఆరోగ్యంగా.. ఇష్టంగా…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



