భారీగా తగ్గిన చికెన్ ధరలు

నవతెలంగాణ- హైదరాబాద్: నాన్‌ వెజ్‌ ప్రియులకు గుడ్ న్యూస్. చికెన్ ధరలు మరోసారి తగ్గాయి.. గతకొన్ని రోజులుగా విపరీతంగా పెరుగుతోన్న చికెన్‌ ధరలు ఇప్పుడు భారీగా తగ్గాయి. కార్తీక మాసం కావడంతో చికెన్‌ ధరలు భారీగా పడిపోయాయి. మొన్నటివరకు ఎలెక్షన్స్ కావడంతో ధరలు ఊపంధుకున్నాయి.. అయితే ఇప్పుడు కార్తీక మాసంతో ధరలు ఒక్కసారిగా సగానికి సగం తగ్గాయి. దీంతో ప్రస్తుతం కిలో చికెన్‌ విత్‌ స్కిన్‌ రూ. 150, స్కిన్‌లెస్‌ రూ. 170కి పడిపోయింది. ఇప్పుడు మరో రూ. 20 తగ్గింది.. స్కిన్ లెస్ ధర రూ. 145 ఉండగా, డ్రెస్సుడ్ చికెన్ ధర ప్రస్తుతం రూ. 128 గా ఉంది.. ఇంకా తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.. గడిచిన నాలుగు నెలల్లో కిలో చికెన్‌ ధర చేరుకున్న కనిష్ట ధర ఇదే కావడం విశేషం. కోళ్లు ఒక పరిమాణానికి వచ్చిన తర్వాత కచ్చితంగా వాటిని అమ్మేయాల్సిందే. లేదంటే వాటికి మేత ఎక్కువవడంతో పాటు అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఉంటాయి. దీంతో మార్కెట్లో డిమాండ్‌ తగ్గి, భారీగా కోళ్లు రావడంతో ఆటోమేటిగ్‌గా ధర తగ్గుతుంది.

Spread the love