వాన గాలి ధూమరానికి అపార నష్టం


నవతెలంగాణ – ఉప్పునుంతల: ఉప్పునుంతల మండలంలోని రాయిచెడు గ్రామానికి చెందిన గొడుగు లింగమ్మ తన వ్యవసాయ పొలంలో పనిచేస్తున్న సమయంలో కస్మికంగా ఏర్పడ్డ గాలి దుమరానికి తన కోళ్ల షెడ్డు రేకులు అమాంతం ఎగిరిపోయాయి. కొన్ని కోళ్లు మృత్యువాత చెందాయి పక్కనే పొలం పనులు చేసుకుంటున్న తను గాలి ధాటికి 30 మీటర్ల మేర దొర్లుకుంటు వెళ్ళటం వల్ల ఆమె కాలు విరిగి ఆసుపత్రి పాలయ్యింది. అదే గ్రామానికి చెందిన కోర్ర రూప్లా నాయక్ కు చెందిన గుడిసె పూర్తిగా ధ్వంసమై గాలికి కొట్టుకుపోయిందని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు స్తంభాలు విరిగి శుక్రవారం నుండి శనివారం సాయంత్రం వరకు కూడా కరెంటు సమస్య తీరలేదన్నారు. పెద్ద పెద్ద చెట్లు విరిగి తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి.
శనివారం ఉదయం ఉప్పునుంతల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కట్ట అనంత రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు.అదే విదంగా రాయిచెడు, సూర్య తండా,పిరాట్వాని పల్లి, తాడూర్ గ్రామాల్లో 27 11కేవీ,35 ఎల్టీ స్తంభాలు విరిగినట్లు విద్యుత్ అధికారులు తెలిపారు. రోజంతా రిపేర్లు చేసి విద్యుత్ అందించేందుకు అధికారులు శ్రమించినట్లు తెలిపారు.అదే విదంగా అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన బూరం రాములు ఇల్లు పైకప్పు డామేజ్ కావడం వల్ల సుమారు 80 వేలు ఆస్తి నష్టం వాటిల్లిందని తెలిపారు. అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన విరోజు శ్యాంసుందర్ కు చెందిన ఇల్లు డామేజ్ విలువ సుమారు మూడు లక్షలు ఉంటుందని అదే గ్రామానికి చెందిన తాళ్ల నిరంజన్ ఇల్లు డామేజ్ విలువ 60 వేలు ఉంటుందని తెలిపారు.రాయి చెడు గ్రామానికి చెందిన గొడుగు లింగమ్మకు చెందిన కోళ్ల ఫారం డామేజ్ విలువ సుమారు లక్ష రూపాయలు ఉంటుందని మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజేశ్వర్ రెడ్డి పంచనామ నిర్వహించి అంచనా విలువ తెలిపారు. ప్రభుత్వం అధికారులు ఈదురు గాలులతో సంభవించిన నష్టాన్ని గ్రామాలను సందర్శించి నష్టాన్ని అంచనా వేసి బాధితులకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం చెల్లించాలని బాధితులు గ్రామస్తులు ప్రజలు కోరుతున్నారు.

filter: 0; jpegRotation: 0; fileterIntensity: 0.000000; filterMask: 0; module:1facing:0;
hw-remosaic: 0;
touch: (-1.0, -1.0);
modeInfo: ;
sceneMode: SFHDR;
cct_value: 0;
AI_Scene: (-1, -1);
aec_lux: 98.0;
hist255: 0.0;
hist252~255: 0.0;
hist0~15: 0.0;
Spread the love