నగరంలో ఒక్కసారిగా భారీ వర్షం..

నవతెలంగాణ-హైదరాబాద్ : మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్ గఢ్ మీదుగా కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా, హైదరాబాద్ నగరంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. అమీర్ పేట్, దిల్ సుఖ్ నగర్, జూబ్లీహిల్స్, ఎల్బీ నగర్, మాదాపూర్, ఖైరతాబాద్, బంజారాహిల్స్, కూకట్ పల్లి, కేపీహెచ్ బీ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రోడ్లపై నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. అటు, తెలంగాణ జిల్లాల్లో పలు చోట్ల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హుజూర్ నగర్ లో 46.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.

Spread the love