పొంగులేటి ఆఫీస్‌పై దాడి..

నవతెలంగాణ-హైదరాబాద్ : ఖమ్మం జిల్లా మధిరలో పొంగులేటి ఆఫీస్‌పై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆఫీస్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. కార్యాలయం ముందు దుండగులు ఫ్లెక్సీలు చించివేశారు. కార్యాలయంలో పూలకుండీలు కూడా ధ్వంసం చేశారు. పొంగులేటి సిబ్బంది సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నట్టు సమాచారం.

Spread the love