ఆదివారం 450 ప్రాంతాల్లో కురిసిన వాన
నిజామాబాద్, జగిత్యాల, ఖమ్మం, ములుగు, జనగామ జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షం
వచ్చే మూడ్రోజులు పలు జిల్లాలకు
భారీ వర్ష సూచన
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో ఆదివారం ఉదయం 8:30 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు 450 రెయిన్‌గేజ్ సెంటర్ల పరిధిలో వర్షపాతం నమోదైంది. ఎక్కువ ప్రాంతాల్లో మోస్తరు వాన పడింది. నిజామాబాద్, జగిత్యాల, ఖమ్మం, ములుగు, జనగామ జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రావినూతలలో అత్యధికంగా 8 సెంటీమీటర్ల భారీ వర్షం నమోదైంది. సోమవారం రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమ్రంభీమ్ అసిఫాబాద్, నిర్మల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో, మంగళవారం ఆదిలాబాద్, కొమ్రంభీమ్ అసిఫాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, బుధవారం నాడు మంచిర్యాల, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షం పడే సూచనలున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వాన పడే అవకాశముంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే సూచనలున్నాయి.
టీజీడీపీఎస్ నివేదిక ప్రకారం అత్యధిక వర్షపాతం నమోదైన ప్రాంతాలు
రావినూతల(ఖమ్మం) 8 సెంటీమీటర్లు
జానకంపేట(నిజామాబాద్) 7.8 సెంటీమీటర్లు
మాల్యాల్(జగిత్యాల) 7.78 సెంటీమీటర్లు
తాటికొండ(జనగాం) 7.6 సెంటీమీటర్లు
మోస్ర(నిజామాబాద్) 7.45 సెంటీమీటర్లు
సిరికొండ(నిజామాబాద్) 7.43 సెంటీమీటర్లు
తూంపల్లి(నిజామాబాద్) 7.33 సెంటీమీటర్లు
రాష్ట్రంలో విస్తారంగా వర్షం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



