న్యూయార్క్‌లో భారీ వర్షాలు..

నవతెలంగాణ – న్యూయార్క్‌: భారీ వర్షాల కారణంగా అమెరికాలోని న్యూయార్క్‌ నగరాన్ని వరదలు ముంచెత్తాయి . లోతట్టు ప్రాంతాలు, హైవేలు, విమానాశ్రయాలు, సబ్‌వేలు జలమయమయ్యాయి. లా గాల్డియా విమానాశ్రయంలో ఒక టెర్మినల్‌ను మూసివేశారు. శుక్రవారం పలుచోట్ల 20 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. అన్ని బహిరంగ ప్రదేశాల్లోకి నీరు చేరడంతో జనజీవనం స్తంభించింది. గవర్నర్‌ కాథీ హౌచుల్‌ న్యూయార్క్‌ నగరం, లాంగ్‌ ఐలాండ్‌,న హడ్సన్‌ వ్యాలీలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ప్రజలు సురక్షితంగా ఉండాలని, వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రయాణించకుండా ఉండాలని గవర్నర్‌ కోరారు. రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.

Spread the love