అమర్‌నాథ్ యాత్రకు ప్రారంభమైన హెలికాప్టర్ బుకింగ్స్..

నవతెలంగాణ- హైదరాబాద్ : అమర్‌నాథ్ యాత్రకు వచ్చే యాత్రికుల కోసం హెలికాప్టర్ సౌకర్యం ప్రారంభమైంది. అమర్‌నాథ్ ఆలయం బోర్డ్‌కు చెందిన వెబ్‌సైట్ http://JKSASB.nic.inలో హెలికాప్టర్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఆగస్టు 19వ తేదీ వరకూ సాగే ఈ యాత్రకు వచ్చే ప్రతి భక్తుడికి రూ.5 లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వనున్నారు. దక్షిణ కశ్మీర్ హిమాలయాలలో 3,880 మీటర్ల ఎత్తులో అమర్‌నాథ్ ఆలయం ఉన్న సంగతి తెలిసిందే.

Spread the love