Wednesday, July 29, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఇంజినీరింగ్‌ పనులపై 
హైలెవెల్‌ కమిటీ

ఇంజినీరింగ్‌ పనులపై 
హైలెవెల్‌ కమిటీ

- Advertisement -

ప్రాజెక్టుల అమల్లో సమగ్ర సంస్కరణలు
ఖర్చుల పెరుగుదల, జాప్యాలకు అడ్డుకట్ట
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో ప్రభుత్వ ఇంజినీరింగ్ పనుల అమలు విధానాన్ని పూర్తిస్థాయిలో సమీక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా మౌలిక వసతుల ప్రాజెక్టుల అమలులో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించడం, ఆర్థిక క్రమశిక్షణను తీసుకురావడం, ప్రాజెక్టులు నిర్ణీత సమయంలో పూర్తయ్యేలా చర్యలు చేపట్టే ఉద్దేశంతో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌‌జాజు మంగళవారం ఉత్తర్వులు (జీఓ నెంబర్‌ 93) విడుదల చేశారు.
ప్రస్తుతం వివిధ ఇంజినీరింగ్ శాఖలు చేపడుతున్న మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో సవరించిన పరిపాలనా అనుమతులు, గడువు పొడిగింపులు, తాత్కాలిక చెల్లింపుల ప్రతిపాదనలు భారీ సంఖ్యలో ప్రభుత్వానికి వస్తున్నాయని తెలిపారు. దీంతో ప్రాజెక్టుల వ్యయం పెరగడం, పనులు ఆలస్యం కావడం, ప్రభుత్వంపై ఆర్థిక భారం అధికమవుతున్నదని పేర్కొన్నారు. ప్రాజెక్టుల ప్రణాళిక దశలో లోపాలు, సమగ్ర సర్వేలు లేకపోవడం, డిజైన్ల ఖరారు ఆలస్యం, భూసేకరణ సమస్యలు, చట్టబద్ధ అనుమతులు, టెండర్ ప్రక్రియ, కాంట్రాక్ట్ నిర్వహణ, పర్యవేక్షణలో ఉన్న లోపాలే ఈ పరిస్థితులకు ప్రధాన కారణాలని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఇంజినీరింగ్ పనుల అమలుకు సంబంధించిన ప్రస్తుత చట్టపరమైన, పరిపాలనా విధానాలను సమగ్రంగా సమీక్షించి అవసరమైన సంస్కరణలను సూచించేందుకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశామని వివరించారు.

3 నెలల్లో నివేదిక
కమిటీ ప్రాజెక్టుల తయారీ, సాంకేతిక పరిశీలన, చట్టబద్ధ అనుమతులు, టెండర్ విధానాలు, మోడల్ బిడ్ పత్రాలు, కాంట్రాక్ట్ నిర్వహణ, సవరించిన పరిపాలనా అనుమతులు, గడువు పొడిగింపులు, తాత్కాలిక చెల్లింపులు, ఆర్థిక క్రమశిక్షణ, చట్టపరమైన సంస్కరణలు, డిజిటల్ వ్యవస్థల వినియోగం వంటి అన్ని అంశాలను ఉన్నతస్థాయి కమిటీ సమగ్రంగా పరిశీలిస్తుందని సీఎస్‌ ‌తెలిపారు. అవసరమైతే నిపుణులను ఆహ్వానించడంతోపాటు ఉప కమిటీలను కూడా ఏర్పాటు చేసుకునే అధికారం కమిటీకి కల్పించామని పేర్కొన్నారు. కమిటీ ఏర్పాటు చేసిన తేదీ నుంచి మూడు నెలల్లో ప్రభుత్వానికి తన నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ కమిటీ సూచనల ఆధారంగా రాష్ట్రంలో ప్రభుత్వ ఇంజినీరింగ్ పనుల అమల్లో పారదర్శకత, ఆర్థిక క్రమశిక్షణ, సమయపాలన పెరగడంతోపాటు ప్రాజెక్టుల వ్యయం అదుపులోకి వచ్చే అవకాశాలున్నాయని తెలిపారు.

​ఉన్నతస్థాయి కమిటీ
చైర్మెన్‌ గా రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, మెంబర్‌ కన్వీనర్ గా ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి సిక్తా పట్నాయక్ , నీటిపారుదల, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా శాఖల ఇంజినీర్-ఇన్-చీఫ్‌లు, పబ్లిక్ హెల్త్ చీఫ్ ఇంజినీర్,న్యాయశాఖ ప్రతినిధి, టీజీఈడబ్ల్యూఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్, ఉద్యోగ విరమణ పొందిన సీనియర్ ఇంజినీర్ కొండలరావు, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇంజినీర్ తదితరులు సభ్యులుగా ఉంటారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -