– ఇంటి వద్ద ఓటు హక్కు వినియోగించుకున్న వికలాంగులు, వృద్ధులు..
నవతెలంగాణ_ బొమ్మలరామారం
బొమ్మలరామారం మండలంలోని హోం ఓటింగ్ ప్రక్రియ శనివారం ప్రారంభమైంది. ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు వెళ్లలేని స్థితిలో ఉన్న వికలాంగులు, వృద్ధులు తమ ఇంటి వద్దనే ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఎన్నికల కమిషన్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ హోం ఓటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. పార్లమెంటు ఎన్నికల్లోను ఓటింగ్ నిర్వహించాలన్న ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు హోo ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది.హోం ఓటింగ్ మొత్తం 35 మంది ఓటర్లు దరఖాస్తు చేసుకున్నారు. మండలంలోని పలు గ్రామాల్లో 18 ఓట్లను వికలాంగులు, వృద్ధులు,నుండి స్వీకరించారు.ఈ కార్యక్రమంలో తాసిల్దార్ శ్రీనివాసరావు, శ్రీనివాస్, వెంకట్ రెడ్డి,ఎలక్షన్ ఆఫీసర్లు పాల్గొన్నారు.