ఒకరికొకరు మద్దతుగా..ఆశాలు, అంగన్వాడీలు

నవతెలంగాణ-జిన్నారం
మండల కేంద్ర మైన జిన్నా రంలో అంగన్వా డీలు, ఆశా వర్కర్లు ఒకరి కొకరు మద్దతుగా మంగ ళవారం సమ్మెను కొనసా గించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో 16రోజులుగా నిరవధికంగా కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె, ఇటీవల ప్రారంభమైన ఆశా వర్కర్ల సమ్మె శిబిరాల బందాలు ఒకరికొకరు తమ బాధలను చెప్పుకుంటూ.. తమ కష్టాలను ప్రభుత్వం ఎప్పుడు తీరుస్తుందో అని ఒకరికొకరు ధైర్యం చెప్పుకున్నారు. ఏళ్ల తరబడిగా సేవలందిస్తున్న తమకు ఇకనైనా న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీల బందం ప్రతినిధులు సుజాత, రాధిక, జయమాల, నాగమణి, భాగ్యలక్ష్మి ఆశ వర్కర్లు నాగమణి, నజీమా బందాలు పాల్గొన్నారు

Spread the love