– ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ
– మండలంలో వెయ్యికి పైగా దరఖాస్తులు
నవతెలంగాణ – మల్హర్ రావు : సామాజిక భద్రత కింద ఇచ్చే పింఛన్ కోసం చాలారోజుల నుంచి లబ్ధి దారులు ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లు కాగా.. అంతకు ముందు రెండేళ్ల నుంచి కొత్త పింఛన్లు ఇవ్వలేదు.ఈ నేపథ్యంలో చేయూత పింఛన్ల మంజూరుపై అధికార యంత్రాంగంలో కదలిక మొదలైంది. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2న కొత్త పింఛన్లను మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.ఇందుకు గాను లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయాలని అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో నాలుగేళ్లుగా కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న దరఖాస్తుదారులు జాబితాలో తమ పేరు వస్తుందనే ఆశతో ఉన్నారు.
పెండింగ్లో వెయ్యి దరఖాస్తులు..
చేయూత పింఛన్ల కోసం మండలంలో సుమారు వెయ్యి మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు చెబు తున్నారు.కొత్త పింఛన్ల పంపిణీలో ముందుగా దివ్యాంగులు, తర్వాత వృద్ధులు, వితంతువులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈ క్రమంలో 50 శాతానికిపైగా దరఖాస్తుదారులకు కొత్తగా పింఛన్లు మంజూరయ్యే అవకాశం ఉంది. అయితే పింఛన్ల మంజూరుకు అనుసరించాల్సిన విధివిధానాలపై ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. గతంలో వివిధ సందర్భాల్లో ఆయా కేటగి రీల వారీగా చేసుకున్న దరఖాస్తులను విచారిస్తారా..? లేదంటే కొత్తగా దరఖాస్తులు స్వీకరించను న్నారా..? అన్నది తెలియాల్సి ఉంది.
‘చేయూత’పై ఆశలు..!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



