సీఎం రేవంత్ రెడ్డి ప్రోగ్రాంకు భారీ ఏర్పాట్లు

నవతెలంగాణ – ఆర్మూర్  

నేడు పట్టణానికి రానున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యక్రమానికి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. పట్టణంలోని పాత బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తాల వద్ద భారీ కటౌట్లు ఏర్పాటు చేసినారు. నియోజకవర్గ ఇన్చార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ,కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఏ బి చిన్న, మున్సిపల్ చైర్ పర్సన్ అయ్యప్ప శ్రీనివాస్, వైస్ చైర్మన్ షేక్ మున్న,, మామిడిపల్లి మాజీ సర్పంచ్ మారుతీ రెడ్డి ,చిట్టి రెడ్డి, పండిత్ పవన్ స్థానిక కౌన్సిలర్లు తదితరులు ఉదయం నుంచి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ బస్వా రెడ్డి ఆధ్వర్యంలో స్టేషన్ హౌస్ ఆఫీసర్, ఎస్సైలు బందోబస్తు ఏర్పాట్లను కట్టుదిట్టం చేస్తున్నారు.
Spread the love